మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ, మెసేజ్‌లు ఏవిధంగా హ్యాక్ అవుతాయో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలియని వ్యక్తులతో మీ వ్యక్తిగత సమాచారన్ని అస్సలు తెలియజేయకూడదు. మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వివరాలను షేర్ చేసుకోకూడదు. సైబర్ క్రైమ్ అధికారులు సైతం ‘అపరిచిత వ్యక్తులతో మీ ఓటీపీ వివరాలను చెప్పకండి. గోప్యతను పాటించండి అంటూ తరచూ భద్రత పరమైన హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ హ్యాకర్ల దాడుల వల్ల గోప్యత వివరాలు బహిర్గతమవుతూనే ఉన్నాయి.
తాజాగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త సమస్య ఎదురవుతోంది. సెల్ ఫోన్ కి వచ్చే మెసేజ్‌ల ద్వారా కూడా సమాచారాన్ని తస్కరిస్తున్నారు. వీటిని పంపినందుకుగాను ఎస్‌ఎంఎస్ దారి మళ్లింపు సంస్థలకు పారితోషికం ఇస్తారు. అయితే ఇది లక్షల్లో ఉంటుందనుకుంటే పొరపాటే. వారికి ఇచ్చే మొత్తం కేవలం రూ.1160(16 డాలర్లు) మాత్రమే. ఇంత తక్కువ మొత్తానికే మీ సమాచారం సైబర్ కేటుగాళ్లు తస్కరిస్తున్నారు. టెలికాం కంపెనీలకు చెందిన ఉద్యోగులతో కలిసి ఈ అదృశ్య సైబర్ దాడి జరుగుతోందని మదర్ బోర్డ్ అనే సంస్థ ప్రకటించింది.
సైబర్ క్రైం సరికొత్త పంథాను ఎంచుకుంది. ఈ సేవలను ఉపయోగించి దాడులు చేసే వారు వ్యక్తులకు వచ్చే మెసే జ్‌లను అడ్డగించలేరు. కానీ వాటికి రిప్లై ఇవ్వగలరు. అయితే ఈ దాడిని కనుగొనడం పెద్ద కష్టమేమి కాదని యూఎస్ సెనేటర్ రాన్ వైడెన్ ఓ ప్రకటనలో తెలిపారు.మెసేజ్‌లకు దారి మళ్లించడానికి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. వాటిలో సిమ్ మార్పిడి కూడా ఒకటి. అయితే సిమ్ మార్చడం ద్వారా సెల్ ఫోన్ నెట్ వర్క్ ను పూర్తిగా డిస్ కనెక్ట్ చేస్తే మీ సమాచారంపై సైబర్ దాడి గురయ్యిందో, లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ సైబర్ దాడిని చాలా ఆలస్యంగా గుర్తిస్తారు. ఈ సమయానికి హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తారు. భద్రతకు సంబంధించి వీలైతే టూ–ఫ్యాక్టర్ అథెంటీకేషన్ కోసం ఎస్‌ఎంఎస్ లను తప్పించాలి. గుడ్ అథండికేటర్ యాప్‌ని ఉపయోగించడం మంచిది.