రష్మిక మందన్న ఫేక్ వీడియో నిందితుడు అరెస్ట్…!

-

నటి రష్మిక మందన్న గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. రష్మిక అందరికీ పరిచయమే. తెలుగులో చాలా సినిమాల్లో నటించి రష్మిక తనేంటో ప్రూవ్ చేసుకుంది ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా ఉంది రష్మిక. ఇది ఇలా ఉంటే రష్మిక ఫేక్ వీడియో గురించి మనకి తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా వివాదాన్ని సృష్టించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని దుర్వినియోగం చేయడం పట్ల పలువురు ప్రముఖులు ఆందోళనని వ్యక్తం చేశారు.

కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటి చట్టంలో కఠిన నిబంధన తీసుకొస్తామని అన్నారు. రష్మిక వీడియో వైరల్ అవ్వడంతో ఢిల్లీ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్లో పట్టుకున్నారు పోలీసులు. బ్లాక్ డ్రెస్ లో ఉన్న బ్రిటిష్ ఇండియన్ జరా పటేల్ వీడియోకి రష్మిక ముఖంతో మార్ఫింగ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news