తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కళాకారుల గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అలానే ఇతర నేతలు, కళాకారులు కూడా పాల్గొన్నారు. మంత్రి రోజా కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చారు. అలానే కళాకారులతో కలిసి డప్పు వాయించారు రోజ. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదన్నారు రోజా. కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల న్యాయం జరగలేదు అని చెప్పారు. కళాకారులకు అండగా నిలబడాలని జగన్ మోహన్ రెడ్డి భావించారు అని కూడా చెప్పారు.
అందుకనే నాకు మంత్రిగా అవకాశం కల్పించారన్నారు. కళాకారులను గుర్తించాం. ధైర్యంగా మేం కార్డుల ప్రదానోత్సవం చేయగలుగుతున్నాం అని అన్నారు. ఇది వరకు ఎవరూ పట్టించుకోలేదు. జగనన్న మాత్రమే కళాకారులను పట్టించుకున్నారు అన్నారు. దొంగలకు, ఆ పందులకు బుద్ధి చెప్పాలంటే కళాకారుల ఆట, మాట, పాట కావాలి అన్నారు. ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024) జగనన్న వన్స్ మోర్ అని రోజా అన్నారు.