‘ఆచార్య’ సినిమా వైఫల్యం ప్రభావం గాడ్ ఫాదర్ పైన కూడా పడుతున్నట్లు కనిపిస్తోంది. ఫెయిల్యూర్ అంటే తెలియని డైరెక్టర్ కొరటాల శివ.. పాన్ ఇండియా స్టార్ మెగా రామ్ చరణ్.. అన్నింటికీ మించి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడు. ఇవేం ఆచార్య సినిమాను హిట్ చేయలేకపోయాయి. ఇప్పుడు చిరంజీవి కొత్త సినిమా గాడ్ ఫాదర్ పై ఆచార్య ఫెయిల్యూర్ ఎఫెక్ట్ పడుతోంది.
‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ రేట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ‘ఆచార్య’ సినిమాకు మాత్రం అప్పుడు సింగిల్ థియేటర్లో రూ.200 ఉంది. ఇప్పుడు ఏకంగా రూ. 50 తగ్గించి, రూ.150 చేశారు. ఆచార్య సినిమా కలెక్షన్లు అంత తక్కువ రావడానికి ఒక రకంగా టిక్కెట్ రేట్లు కూడా కారణం అయ్యాయి. ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయంలో అలాంటి తప్పు చేయకూడదని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి టిక్కెట్ రేట్లను తగ్గించారట.
‘గాడ్‌ఫాదర్’ సినిమాను తమిళ దర్శకుడు మొహన్‌రాజా తెరకెక్కించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.