ఆచార్య నుంచి రామ్ చరణ్ ‘సిద్ధ’ స్పెషల్ లుక్.. చిరుతో కలిసి !

-

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి నెలలో ఈయనను సినిమా సెట్స్ లోకి ఆహ్వానిస్తూ సినిమా దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మా ‘సిద్ధ’ సర్వం సిద్ధం. రామ్ చరణ్ గారికి సెట్స్ లోకి స్వాగతం అంటూ దర్శకుడు అప్పట్లో కొరటాల శివ ట్వీట్ చేశారు.

ఇక ఈరోజు రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో చిరంజీవితో ఆయన కలిసి ఉన్న పిక్ ఒక దానిని షేర్ చేశారు. ఇద్దరూ నక్సల్ దుస్తుల్లో ఉండగా చెరొక గన్ పట్టుకుని నడుస్తూ రావడం కనిపించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్ తేజ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news