ఎక్కువగా నిద్రపోతే కరోనా రాదంట..!?

Join Our Community
follow manalokam on social media

ఎక్కువ సేపు నిద్రించడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో లాభాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన ఓ అధ్యాయనంలో మంచి నిద్ర వల్ల కరోనా సోకే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని వెల్లడించారు. ఈ మేరకు బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ అనే జర్నల్‌లో నివేదిక ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల కారణంగా శరీరంలో కరోనా వైరస్ ఈజీగా ప్రవేశించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అందుకే కంటి నిండా నిద్రించినప్పుడు ఎలాంటి సమస్యలు దరిచేరవన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు కరోనా సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన నిర్వహించారు. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అమెరికా, యూకే దేశాల్లోని కరోనా బాధితులకు చికిత్స అందిస్తూ వైరస్ బారిన పడిన వైద్య సిబ్బందిపై సర్వే నిర్వహించారు.

నిద్ర
నిద్ర

ఈ సర్వే వైద్య సిబ్బంది ఎంత సమయం వరకు నిద్రపోతున్నారనే విషయంపై పరిశోధన చేశారు. ఇందులో 40 శాతం మంది నిద్రలేమి సమస్యతో, మానసిక ఒత్తిడికి గురైన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యమని, అప్పుడే వైరస్ బారిన పడకుండా ఉంటారని తెలిపారు. సాధారణ నిద్ర కంటే ఒక గంట ఎక్కువగా నిద్రించినా 12 శాతం వరకు కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. గతేడాది అక్టోబర్‌ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,21,066 యాక్టివ్‌ కేసుల ఉన్నాయి.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...