తునిలో టీడీపీ నేతపై హత్యాయత్నంపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి గొడ్డలిపోటును మంత్రులు, ఎమ్మెల్యే లు వారసత్వంగా తీసుకున్నారు… తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు, తుని ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావు పై స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అనుచరులు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. శేషగిరిరావు ఇంట్లో ఉండగానే వైసీపీ గూండాలు దాడికి దిగారని నిప్పులు చెరిగారు.
వైసీపీ ఆగడాలకు అడ్డుగా నిలబడి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసే టీడీపీ నేతల గళాలపై అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నారని… తుని నియోజకవర్గంలో కాపులకు అన్యాయం చేస్తున్న వైసీపీ చర్యలను నిలదీస్తున్నందుకే శేషగిరిరావును చంపడానికి ప్రయత్నించారని నిప్పులు చెరిగారు. కాపు సామాజికవర్గంపై జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు గొడ్డళ్లతో వేటాడుతున్నారని.. హత్యలు, దాడులు చేసి బెదిరించే ఈ దుష్ట ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసి, ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వారిని, చేయించిన వారిని కటకటాల వెనక్కి పంపే వరకు బాధితుల తరపున పోరాడుతామన్నారు.