దంచి కొడుతున్న ఇండియా ఓపెనర్లు… శుబ్ మాన్ గిల్, గైక్వాడ్ లు 50’S !

-

ఆస్ట్రేలియా నిర్దేశించిన 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా చాలా సునాయాసంగా చేధించేలా కనిపిస్తోంది, ఎందుకంటే మొదట ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఏ మాత్రం సౌకర్యంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. కానీ ఇండియా మాత్రం చాలా స్వేచ్ఛగా పరుగులు చేస్తూ ఆస్ట్రేలియా బౌలర్లకు సవాలు విసురుతోంది. కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియా బౌలర్లు సమర్ధవంతమగా తమ జాబ్ కంప్లీట్ చేసి ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్ కె కట్టడి చేశారు. ఇండియా తరపున ఓపెనింగ్ చేసిన శుబ్ మాన్ గిల్ మరియు ఋతురాజ్ గైక్వాడ్ లో చాలా సులభంగా బంతిని నాలుగు దిక్కులా కొడుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరూ కూడా అర్ద సెంచరీ లను పూర్తి చేసుకుని నాట్ అవుట్ గా క్రీజులో ఉన్నారు. శుబ్ మాన్ గిల్ (62) సిక్సు కొట్టి అర్ద సెంచరీ పూర్తి చేశాడు.. ఇదే ఊపులో ఆడితే వరుసగా సెంచరీ సాధించే అవకాశం గిల్ కు ఉంటుంది. ఇక గైక్వాడ్ (61) కు అంతర్జాతీయ వన్ డే కెరీర్ లో ఇదే మొదటి అర్ద సెంచరీ కావడం విశేషం.

చాలా బలమైన జట్టు మీద ఓపెనర్ గా వచ్చి అర్ద సెంచరీ చేయడం అంటే మాటలు కాదు. ఇండియా ఓపెనర్లు ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాను దంచి కొడుతున్నారు. ప్రస్తుతం ఇండియా స్కోర్ వికెట్ నష్టపోకుండా 125 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news