బెదిరింపుల కేసులో శ్రీకాకుళం జిల్లా జైలు నుంచి విడుదలైన అచ్చెన్నాయుడు ఉద్వేగానికి గురయ్యారు. కార్యకర్తలను చూసి అచ్చెన్న కంట తడి పెట్టారు. సంబంధం లేని కేసులో నన్ను ఇరికించారని, పోలీసు వ్యవస్థ ను చూస్తే సిగ్గేస్తుందని అన్నారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఆ ఉద్యోగానికి అనర్హుడన్న అచెన్న నేను బెదిరించానో లేదో… ఆడియో విని చెప్పండని అన్నారు. నాపై ఇంత దారుణంగా వ్యవహరించినా అనుభవమున్న తమ్మినేని, ధర్మాన సోదరులు ఎందుకు మౌనం వహించారు ? అని ఆయన ప్రశ్నించారు.
వారి అనుభవం ఏమయ్యింది ? అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం లో ప్రజలు ఓటు తో సమాధానం చెప్పాలన్న ఆయన పులిని బోనులో బంధించి ఏకగ్రీవం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని కార్యకర్తలు తిప్పి కొట్టారని అన్నారు. విశాఖ ఉక్కు పై పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆయన అన్నారు. ప్రైవేటీకరణ ఆలోచన నన్ను బాధించిందని ఆయన అన్నారు. ఇక ఈరోజే అచ్చెన్న స్వగ్రామం అయిన నిమ్మడలో ఎన్నికలు జరుగుతున్నాయి.