హిందూ దేవాలయాలకు జగన్ కాపలా కాయాలి : అచ్చెన్నాయుడు

Join Our COmmunity

హిందూ దేవాలయాలపై దాడులు జరగ్గకుండా సీఎం జగన్ కాపలా కాయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జగన్ క్రైస్తవుడు కాబట్టి.. దేవాలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత మరింత ఎక్కువగా ఉందని ఆయన అన్నారు. క్రైస్తవులైన జగన్, హోం మంత్రి సుచరిత, డీజీపీలు క్రైస్తవులు.. దేవాలయాలపై ఈగ వాలకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు. దేవాలయాలపై దాడులు జరిగుతుంటే.. మాపై నిందలు వేస్తున్నారని అయన పేర్కొన్నారు.

దేవాలయాలను కాపాడే విషయంలో సీఎం ఫెయిలయ్యారన్న అచ్చెన్న హిందూ దేవాలయాలపై బీజేపీ ప్రేమ మాటలు కాదు.. చేతల్లో చూపాలని అన్నారు. దేవాలయాలపై దాడుల విషయంలో బీజేపీ డైవర్షన్ రాజకీయం చేస్తోందని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మించే సందర్భంలో దేవదాయ శాఖ మంత్రిగా బీజేపీ నేత మాణిక్యాలరావే ఉన్నారని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతోనే గుళ్లని తొలగించారని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తోన్న ప్రభుత్వంపై బీజేపీ యుద్దం ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు.

TOP STORIES

ఫౌ-జి గేమ్‌కు భారీ స్పంద‌న‌.. తొలి రోజు ఎంత మంది డౌన్‌లోడ్ చేసుకున్నారంటే..?

ఎన్‌కోర్ గేమ్స్ డెవ‌ల‌ప్ చేసిన ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ (ఫౌ-జి) గేమ్ గ‌ణ‌తంత్ర దినోత్సవం సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం గేమింగ్ ప్రియుల‌కు అందుబాటులోకి వ‌చ్చిన విష‌యం...
manalokam telugu latest news