బండి సంజయ్ ఏపీ రాజకీయాల్లోను హీట్ పెంచుతున్నారా ?

-

తెలంగాణ బీజేపీ సారధిగా దుబ్బాక,జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాటల తూటలతో హీట్ పెంచిన బండి సంజయ్ ఇప్పుడు ఏపీ రాజకీల పై ఫోకస్ పెట్టారా…ఏపీలోని దేవాలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనల పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్స్ చూస్తుంటే ఇప్పుడు ఔననే సమాధానమే వినిపిస్తుంది. త్వరలో జరుగనున్న తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో తురుపుముక్కగా బండి సంజయ్ కీలకపాత్ర పోషింఛ బోతున్నారా అన్నది ఏపీ రాజకీయాల్లోను ఆసక్తి రేపుతుంది.

ఏపీలో అధికార వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైబిల్ పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలే తిరుపతిలో పునరావృతమవ్వబోతున్నాయని జోస్యం చెప్పారు. ఏపీలో జరుగుతున్న వరుస సంఘటనలు దేవాలయాల పై దాడులను బీజేపీ తమకు అనుకూలంగా ఉపయోగించుకునే పనిలో ఉండటం..ఈలోపే బండి సంజయ్ వైసీపీ ప్రభుత్వం పై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఏపీరాజకియాల్లోను కాక పుటిస్తున్నాయి.

ఏపీ హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన బండి సంజయ్..వైసీపీ రెండు కొండలు అంటోందని.. ‘ఏడు కొండలవాడా గోవిందా గోవిందా’ అనేది బీజేపీ సిద్ధాంతమన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం‌ కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామన్నారు. ఏపీ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు.‌ హిందువుల కానుకలను దారి మళ్ళిస్తోందని ఆరోపించారు. ఏపీ బీజేపీ కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. ఇప్పటివరకు ఏపీ బీజేపీ నేతలు ఈ స్థాయి విమర్షలు వైసీపీ సర్కార్ పై చేయలేకపోయారు. ఇప్పుడు బండి సంజయ్ దూకుడు చూస్తుంటే సోము వీర్రాజు నాయకత్వంలో ఏపీ బీజేపీ కూడా బండి సంజయ్ నాయకత్వంలో పని చేయల్సివచ్చేలా ఉందనే సెటైర్లు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.

రామతీర్ధంలో జరిగిన ఘటన పై ఏపీ బీజేపీ కంటే టీడీపీ ఎక్కువ పోరటపటిమ కనబరచడం వైసీపీ vs టిడీపీ గానే వివాదం నడవడంతో బీజేపీ కాస్త వెనుకబడింది. జనసేనతో పొత్తున్నప్పటికి బీజేపీ నేతలు సమన్వయం చేసుకోవడంలో విఫలమవ్వడంతో ఇప్పుడు బండి సంజయ్ అస్త్రన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందన్న టాక్ ఏపీ రాజకీయాల్లో నడుస్తుంది. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ కార్యకర్తలు బలవంతులన్న బండి సంజయ్ ముందు ముందు పార్టీ ఏపీలో పార్టీ కేడర్ లో ఎలా దూకుడు పెంచుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news