Radhe Shyam: సంక్రాంతి బరిలో రాధేశ్యామ్.. రిలీజ్ ఆ రోజే!

-

Radhe Shyam: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఒక చిత్రం రాధేశ్యామ్. 1960 నాటి వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ స‌ర‌స‌న టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది. భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి.

వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎప్పుడెప్పుడూ వ‌స్తుందని వేట్ చేస్తున్నారు డార్లింగ్ ప్ర‌భాస్ అభిమానులు. కానీ ముందుగా ప్ర‌క‌టించిన తేదీ కాకుండా.. రెండు రోజుల ముందే విడుద‌ల కానున్న‌దని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జోరుగా సాగింది. ఈ పుకార్ల పై స్పందించిన మూవీ యూనిట్ .. ఆ వార్తల్లో నిజం లేదనీ, ముందుగా ప్ర‌క‌టించిన తేదీలో ఎలాంటి మార్పు లేదని, జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

సంక్రాంతి బ‌రిలో అగ్ర‌హీరోలు నిల‌వ‌డంతో ఈ పండుగ‌కు ధియేటర్లో సినిమాల దండయాత్ర జరగబోతుంది. 2022 సంక్రాంతికి ఇప్పటికే ఐదు సినిమాలు తమ విడుద‌లకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు,
సంక్రాంతి కానుకగా 12న పవన్ కళ్యాణ్‌ ‘భీమ్లా నాయక్’, 13న ప్రిన్స్ మహేశ్ బాబు ‘సర్కారు వారిపాట’
జ‌న‌వ‌రి 14న ‘రాధేశ్యామ్’ ఇదే రోజున వెంకటేష్ వరుణ్ తేజ్ లు మరోసారి నవ్వించడానికి ఎఫ్ 3 తో రెడీ అవుతున్నారు. అయితే… తాజాగా ‘ట్రిపుల్ ఆర్’ మూవీ సైతం సంక్రాంతి సీజన్ కే వచ్చే ఆస్కారం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news