తొలగని గులాబ్ ముప్పు.. నేడు రేపు వానలే…

-

గులాబ్ ముప్పు ఇంకా తొలగలేదు. తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని  వాతావరణ హెచ్చరికలు చేస్తోంది. ఇప్పటికే గులాబ్ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు కురిశాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. మరో రెండు రోజులు కూడా రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ

Godavari

శాఖ హెచ్చరికలు చేస్తోంది. తాజాగా కురిసిన వర్షాలతో తెలంగాణలో గోదావరి నది ప్రవాహ తీవ్రత తగ్గడం లేదు. తెలంగాణలోని అన్ని రిజర్వాయర్లు, బ్యారేజీల గేట్లు ఎత్తివేయడంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి, అన్నారం, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్ద బ్యారేజీల గేట్లు ఎత్తి వేయడంతో వరద నీరు దిగువకు వెళ్తోంది. దీంతో దిగువ ప్రాంతాలైన భద్రాచలం వద్ద గోదావరి ఉద్రుతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాదహెచ్చిరిక జారీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చిరి

స్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news