పాపం పృథ్వీ… అవకాశాల కోసం ఇంత ఎదురు చూస్తున్నాడా…?

-

నోటి దూల ఉంటే ఎంతటి వాడు అయినా సరే ఇబ్బందులు పడటం ఖాయం అనే విషయం స్పష్టంగా అర్ధమైంది హాస్య నటుడు పృథ్వీ రాజ్ తో. హాస్య నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన ఆయన… ఆ తర్వాత రాజకీయాల్లో కూడా కాస్త ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అయితే అక్కడ ఆయన తన నోటి దురుసు సహా కొన్నింటి తో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనవసర విషయాల్లో తల దూర్చి ఇబ్బందులు కొని తెచ్చుకున్నారు.

అమరావతి రైతుల గురించి ఆయనకు సంబంధం లేదు. కాని ఆయన మాత్రం కాస్త అత్యుత్సాహం చూపించి వ్యాఖ్యలు చేసారు. దీనితో ఆయన ఇబ్బంది పడాల్సి వచ్చింది. కీలకమైన పదవిని కూడా పోగొట్టుకున్నారు. ఆ పదవి కోసం చాలా మంది ఎదురు చూస్తారు. అలాంటి పదవి వచ్చి కూడా పృథ్వీ కొన్ని కొన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఇది పక్కన పెడితే, ఇప్పుడు ఆయన ఇబ్బంది పడుతున్నట్టే కనపడుతుంది.

అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్టే అర్ధమవుతుంది. అందుకే ఏమో తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. కనీసం ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఫోన్ చేయలేదని, తన చుట్టూ ఉన్న వాళ్లే ఇప్పుడు తనను పట్టించుకోవడం లేదని, అప్పుడు తనకు అండగా నిలిచింది చిరంజీవి అంటున్నాడు ఈయన. పాపం వాడెలా ఉన్నాడో చూడండ్రా అంటూ కొందరికి చెప్పాడని.. అంత గొప్పవాడు ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పుకొచ్చారు. అంటే ఈయన అవకాశాల కోసం చిరంజీవి కుటుంబాన్ని దువ్వుతున్నారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version