బిగ్ బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కన్నుమూత

-

గుండె నొప్పితో నిన్న హాస్పిటల్ లో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. 59 ఏళ్ళ వివేక్ నిన్న ఉదయం 11 గంటలకు గుండెపోటు కారణంగా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. నటుడిగా వివేక్‌ దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించారు.

ఆయన నటించిన సింగం సిరీస్, శివాజీ, రఘువరన్ బీటెక్ లాంటి సినిమాలు ఆయన్ను తెలుగు వారికీ దగ్గర చేశాయి. కె. బాలచందర్‌ సినిమాతో పరిచయం అయిన వివేక్‌ దాదాపు పెద్ద హీరోలందరితో కలిసి నటించారు. చెన్నై ఓమందూరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో వివేక్‌ గురువారం కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టీకా మాత్రమే మన ప్రాణాలను కాపాడుతుందంటూ ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news