ఐపీఎల్: PBKS vs CSK.. చెన్నై అలవోకగా..

-

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచు జరిగిన మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ అలవోకగా గెలిచింది. పంజాబ్ నిర్దేశించిన 107పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే చేధించింది. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ కింగ్స్, 20ఓవర్లు ముగిసే సరికి 8వికెట్లు కోల్పోయి 106పరుగులు చేయగలిగింది. పంజాబ్ బ్యాట్స్ మెన్లలో షారుక్ ఖాన్ ఒక్కడే అత్యధిక స్కోరు 46పరుగులు చేసాడు. మిగిలిన వాళ్ళలో జే రిచర్డ్ సన్ 15, గేల్ 10, దీపక్ హుడా 10పరుగులు చేయగలిగారు. మిగతా వాళ్ళంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహార్ 4వికెట్లు, సామ్ కరేణ్, బ్రేవో, మొయిన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

107పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కడా తడబడకుండా సునాయాసంగా నెగ్గుకు వచ్చింది. 15.4 ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి ఈ సీజన్లో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చెన్నై బ్యాట్స్ మెన్లలో మొయిన్ అలీ 46పరుగులు( 31బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్), ఫా డుప్లెసిస్ పరుగులు 36పరుగులు ( 33బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్) చేసారు. పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే, మహమ్మద్ షమి 2వికెట్లు, అర్ష్ దీప్ సింగ్, మురుగన్ అశ్విన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news