అలనాటి అందాల తార జయకుమారి నేడు దీన స్థితిలో ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమాల్లో రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆమె నేడు ఆర్థికంగా ఆదుకోవాలంటూ అభ్యర్థిస్తున్నారు. 70 ఏళ్ల వయసులో ఉన్న జయకుమారి ప్రస్తుతం కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తమిళనాడులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
చికిత్స కోసం ఆమె వద్ద డబ్బులు లేవని ఆర్థికంగా సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కానీ.. ఎవరైనా తనకు ఆర్థిక సాయం చేయాలని వేడుకుంటున్నారు. జయకుమారి మలయాళ చిత్రం ‘కలెక్టర్ మాలతి’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.
1967లో ఈ చిత్రం విడుదలైంది. తెలుగులో ఎన్టీఆర్ దగ్గర నుంచి తమిళంలో ఎంజీఆర్, రాజ్‌కుమార్, దిలీప్‌కుమార్ లాంటి అగ్ర హీరోలందరితో నటించారు. ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసి మెప్పించారు. టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులోనూ రంగేళి రాజా, కల్యాణ మండపం, ఇంటి గౌరవం వంటి సినిమాల్లో నటించి ప్రశంసలు పొందారు.