నటి కస్తూరి తాజాగా హైదరాబాద్ లో అరెస్ట్ అయింది. లోకల్ పోలీసులు అరెస్ట్ చేసి చెన్నై పోలీసులకు అప్పగించారు. గచ్చిబౌలిలో ఉన్న కస్తూరిని అరెస్ట్ చేశారు. నటి కస్తూరికి మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సింగిల్ బెంచ్ ధర్మాసనం ఇటీవలే కొట్టివేసింది.
రాజుల కాలంలో అంత:పురం మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వాళ్లే తెలుగువారని.. అలా వచ్చినవారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడింది. 300 ఏండ్ల క్రితం ఒక రాజు వద్ద అంత:పుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. ఇప్పుడు వారు తమది తెలుగు జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది. ప్రస్తుతం తమిళనాడు ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. ఇతరుల ఆస్తులను లూటీ చేయొద్దు. ఇతర భార్యలపై మోజుపడొద్దు. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతున్నారు. ఇలా మంది చెబుతున్నారు కాబట్టే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం సాగుతోందని కామెంట్స్ చేసింది. దీంతో ఆమె పై కేసులు నమోదు అయ్యాయి. ఆమెకు నోటీసులు ఇచ్చేందుకు ఇటీవల పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమె ఇంటికి తాళం వేసుకుని ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని ఎటో వెళ్లిపోయింది. ఆమె కోసం గత వారం రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు.