మంత్రి రోజాకు మద్దతుగా మరో సీనియర్‌ నటి

-

టీడీపీ నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే.. మంత్రి రోజా బ్లూఫిలింలలో నటించిందన్న మంత్రి బండారు సత్యనారాయణపై సినీ నటి రాధిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక మహిళ బ్లూఫిలింలు చేసిందని చెప్పడమేంటి? మీరు బయటకు వెళ్తున్నారుగా.. మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఇవి లో క్వాలిటీ పాలిటిక్స్. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటు. ఇది ప్రధాని మోదీ దృష్టికి వెళ్లాలి’ అని రాధిక అన్నారు.

Radikaa Sarathkumar: I realised I'm too outright and frank to be in politics

అంతకుముందు.. బండారు సత్యనారాయణపై నటి కుష్బూ సుందర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. మహిళా మంత్రిపై ఈ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని.. ఓ మనిషిగా కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళల పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇలా మాట్లాడరని వ్యాఖ్యానించారు. మహిళలను దూషించడం తన జన్మహక్కు అన్నట్లు టీడీపీ నేత వ్యవహార తీరు ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు. వెంటనే రోజాకు బండారు సత్యనారాయణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తాను రోజాకు సపోర్ట్‌‌గా పోరాటం చేస్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news