తెలంగాణలో హంగ్ వస్తుంది : బీఎల్‌ సంతోష్

-

తెలంగాణలో రేపోమాపో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు – చేశారు. ‘తెలంగాణలో హంగ్ వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మనమే అధికారంలో ఉంటాం. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో కథనాలు నమ్మొద్దు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవాళ్లు ప్రజల్లో ఉండాలి. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు’ అని బీఎల్‌ సంతోష్‌ అన్నారు.

Who Is B.L. Santosh and Why Is He Facing Ex-BJP CM Jagadish Shettar's Ire?

అంతేకాకుండా.. టికెట్లు హైదరాబాద్, ఢిల్లీలో ఇవ్వరు. అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల్లో ఉండాలి. నేతలు వివేకంతో ఆలోచించాలంటూ బీఎల్ సంతోష్ హితవు పలికారు.
కాగా, నిన్న(గురువారం) జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో కూడా బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని, ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామని సంతోష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news