రంగాలతో సంబంధం లేదు.. ప్రతీ భారతీయుడూ స్పందిస్తున్నాడు.. ఆగ్రహానికి గురవుతున్నాడు.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. దానికి కారణం చైనా దురాగతమే! దొంగ దెబ్బ తీయడాన్ని వీరత్వంగా భావించారో లేక అంతకుమించి మరో విద్య ఆ దేశం నేర్పలేదో తెలియదు కానీ… భారత సైన్యంపై దొంగ దెబ్బతీసి, రాక్షసంగా ప్రవర్తించి సుమారు 20మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది చైనా సైన్యం! ఈ క్రమంలో చైనా ఉత్పత్తులను ఎట్టిపరిస్థితుల్లోనూ నిషేదించాలని క్రికెటర్ హర్భజన్ సింగ్ లాంటి వారు ఓపెన్ గా ప్రకటించిన నేపథ్యంలో…. నటి సాక్షి అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం బాషల్లో నటిగా మంచి పేరుతెచ్చుకున్న సాక్షి అగర్వాల్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఇకపై తాను చైనా ఉత్పత్తులను వినియోగించరాదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఇదే క్రమంలో చైనా ఉత్పత్తులను కూడ ఈ దేశ ప్రజలు ఉపయోగించరాదని, తాను కూడా ఉపయోగించనని తెలిపింది. ఇదే క్రమంలో చైనాకు చెందిన ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా తాను నటించనని సాక్షి తెలిపింది. సాక్షి ఈ న్రిణయం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
ఇదే క్రమంలో ప్రతీ సెలబ్రెటీ.. ఇదే క్రమంలో ప్రతీ భారతీయుడు ఆలోచించాలని…. భారతీయులంతా ఒక్కసారి ప్రతినపూనితే… అర్థసంవత్సరం గడిచేలోపు చైనా ఆర్థికంగా కుదేలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే… ఈ సమయంలో యుద్ధం కంటే.. చైనాను ఆర్థికంగా దెబ్బతీయడంపైనే ముఖ్యంగా దృష్టి సారించాలని పలువురు రాజకీయ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి. నాలుగు రోజుల్లో భారతీయులు అంతా చల్ల బడతారు.. సైలంట్ గా ఉందామనుకుంటారా? నిన్న జరిగిన వ్యవహారాన్ని చైనా జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చర్యలు తీసుకుంటారా అనేది వేచి చూడాలి.!