ఆరోగ్యసేతు యాప్ ను వారు తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేసుకోవాలి

-

కరోనా నేపథ్యంలో విమానాల్లో ప్రయాణించే వారు కచ్చితంగా ఆరోగ్యసేతు యాప్ ను తమ తమ ఫోన్లలో ఇన్‌‌స్టాల్‌ చేసుకోవాలని గతంలోనే కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అయితే ఇకపై విమానాల్లో సిబ్బంది కూడా ఆరోగ్య సేతు యాప్ ను వాడాల్సి ఉంటుంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సోమవారం విమానయాన సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

airlines crew must use aarogya setu app కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని డీజీసీఏ తెలిపింది. ఇకపై దేశంలోని అన్ని విమానయాన సంస్థల సిబ్బంది తప్పనిసరిగా తమ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ ను వాడాల్సి ఉంటుంది. దీంతో కరోనా ఉన్న ప్రయాణికులు లేదా విమానసిబ్బంది దగ్గరగా వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక విమానయాన సంస్థకు చెందిన డాక్టర్.. సిబ్బందిని కచ్చితంగా పరీక్షించాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని కోవిడ్ కేంద్రాలకు పంపించాలి. ఐసీఎంఆర్ సూచనల మేరకు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. విమాన సిబ్బంది హోం క్వారంటైన్ లో ఉండాలా, వద్దా అనే నిర్ణయాన్ని ఆ డాక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది.

కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 9,440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 55.77 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,74,387 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news