గీతా ఆర్ట్స్ ఎదుట నగ్నంగా సునీత బోయ నిరసన.. నడిరోడ్డుపై హల్ చల్

-

టాలీవుడ్‌ లో కలకలం చోటు చేసుకుంది. సినీ నిర్మాత బన్నీ వాసు కారణంగా మోసపోయానని సునీత బోయ మరోసారి గీత ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్నంగా బైటాయించింది. ఆమె చాలా కాలంగా ఈ ఆరోపణ చేస్తోంది. పలుమార్లు గీత ఆర్ట్స్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది.

ఆమె మానసిక స్థితి సరిగ్గా లేనందున పోలీసులు ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చికిత్స చేయించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాజాగా గురువారం రాత్రి సైతం నగ్నంగా ఆందోళనకు దిగడంతో జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

దుస్తులు వేసి సర్ది చెప్పారు. తనకు నెలవారి ఖర్చులకు ఇబ్బందిగా ఉందని ఆమె పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. బన్నీ వాసు బృందం ఇతర ప్రాంతంలో ఉందని, వచ్చాక మాట్లాడతామని చెప్పిన పోలీసులు కొంత డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news