ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడిలో పలువురు మరణించడం బాధకరమైన విషయమని తెలిపారు. కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం అంతా ప్రశాంతంగా ఉందని,కాశ్మీర్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు.ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదులు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాశ్మీర్ లోని పహల్ గామ్ లో ఉగ్రదాడికి బదులు తీర్చుకోవాలని యావత్ భారత్ కోరుకుంటుంది. ఈ నేపథ్యంలో త్రివిద దళాధిపతులతో డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ కీలక భేటీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుత పరిస్తితి, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ పై NSA అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ పోర్స్ చీఫ్ ఏపీ సింగ్, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠితో రాజ్ నాథ్ సింగ్ చర్చించారు.