రూ.21,700 కోట్ల అప్పు తీర్చిన అదానీ

-

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారీగా షేర్ వాల్యూను కోల్పోయిన ఆదాని గ్రూప్, తమ ప్రతిష్టను పెంచుకునేందుకు ముందస్తుగా అప్పులను చెల్లిస్తోంది. తాజాగా రూ.21,700 కోట్లు అప్పును తీర్చేసినట్లు సంస్థ ప్రకటించింది.

తమ షేర్లను తనకా పెట్టి తీసుకున్న రూ.17,630 కోట్లు, అంబుజా సిమెంట్ కోనుగోలుకు తీసుకున్న రూ.4,100 కోట్లను తిరిగి చెల్లించినట్లు పేర్కొంది. ఇటీవల రూ.7,374 కోట్ల అప్పుడు తీర్చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఆదాని గ్రూపు ఏపీలో వివిధ రంగాల్లో ఇప్పటికే రూ.20వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని ఆదాని స్పోర్ట్స్ CEO కరణ్ ఆదాని తెలిపారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 70 వేల మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇన్వెస్టర్ సమ్మిట్ లో మాట్లాడుతూ, ‘గంగవరం, కృష్ణపట్నం పోర్టుల సామర్థ్యాన్ని 200 మి. ట. ల.కు పెంచనున్నాం. రెన్యువబుల్ ఎనర్జీలో 15వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నాం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news