వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా : అద్దంకి

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణలు చెప్పారు కాంగ్రెస్‌ నేత అద్దంకి దయాకర్‌. అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆయనకు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్లు అద్దంకి దయాకర్‌ ప్రకటించారు‌. శుక్రవారం చండూరు సభలో అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వెంకటరెడ్డిని సైతం ఉద్దేశిస్తూ.. పార్టీలో ఉంటే ఉండూ లేకుంటే.. అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశాడాయన. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో అద్దంకి దయాకర్‌పై విమర్శలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ నేతలు పలువురు అద్దంకి దయాకర్‌ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Addanki Dayakar : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్‌పై దాడి.. పార్టీలో మరోసారి  భగ్గుమన్న విభేదాలు.. | internal fight in nalgonda congress leads to attack  on congress leader addanki dayakar in Thungathurthy details here mks–  News18 Telugu

పైగా సీనియర్ల సమక్షంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. ఎవరూ నిలువరించకపోవడంపై ఏఐసీసీ సైతం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుతాయని అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌
నోటీసులు జారీ చేసింది తెలంగాణ కాంగ్రెస్‌. దీంతో.. వెంకటరెడ్డి, ఆయన అభిమానులకు క్షమాపణలు చెప్తున్నా. ఏదో ఆవేశంలో నోరు జారాను. క్షమించండి. పార్టీకి నష్టం చేయాలని ఎప్పుడూ నేను భావించను. నా వ్యాఖ్యలపై అధిష్టానానికి వివరణ ఇవ్వాలని అనుకున్నా. ఈ లోపే షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటా అని ప్రకటించారు అద్దంకి దయాకర్‌.