అలా అడిగి పూర్ణ ను ఇబ్బంది పెట్టిన ఆది .. వీడియో వైరల్..!

-

ప్రస్తుతం బుల్లితెరపై ప్రతి ఆదివారం ప్రసారం అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున అలరిస్తున్న కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా ఒకటి. ఇక తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేయగా బాగా వైరల్ అవుతూ ఉండడ గమనార్హం. ఇక ఈ ప్రోమోలో భాగంగా ఈ కార్యక్రమానికి తీస్ మార్ ఖాన్ చిత్ర బృందం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోని ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ పాయల్ రాజపుత్ కూడా హాజరవడం జరిగింది. ఇక హైపర్ ఆది.. హీరో ఆదితో మాట్లాడుతూ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇక హైపర్ ఆది.. హీరో ఆది సాయికుమార్ తో మాట్లాడుతూ ఉండగా మధ్యలో పూర్ణ జోక్యం చేసుకోవడం జరిగింది.

హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నాడు.. హీరో ఆది చాలా క్వైట్ గా ఉంటాడని చెప్పింది. ఈ విధంగా పూర్ణ మధ్యలో మాట్లాడడంతో వెంటనే ఆది కలగజేసుకొని పూర్ణ మీ హనుమాన్ బాగా జరిగిందా అంటూ ప్రశ్నించారు.. ఇలా ఒక్కసారిగా ఆది ఆమె హనీమూన్ గురించి అడగడంతో ఆమె సిగ్గుతో తలదించుకుంది. ఇక ప్రస్తుతం పూర్ణ గురించి హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ బాగా వైరల్ అవుతూ ఉండడంతో నెటిజెన్లు కూడా ఈ విషయంపై స్పందిస్తూ పెళ్లి కాకుండానే హనీమూన్ ఏంటి హైపర్ ఆది ఇది మరీ విడ్డూరం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రముఖ వ్యాపారవేత్తతో తన నిశ్చితార్థం జరిగిందని తన కాబోయే భర్త అతడే అంటూ ఫోటోలను కూడా పూర్ణ షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ క్రమంలోని హైపర్ ఆది పూర్ణ పై పంచులు వేస్తూ ఇలా తన హనీమూన్ గురించి అడగడంతో మరోసారి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఆది.

Read more RELATED
Recommended to you

Latest news