ఆది పినిశెట్టి.. ఇటీవల రామ్ పోతినేని నటించిన ది వారియర్ సినిమాలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈయన తన ప్రేమ వివాహం గురించి వెల్లడించారు. తెలుగు, తమిళ్ చిత్రాలలో వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి కేవలం హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా మరింత పాపులాంటిని సంపాదించుకున్నాడు. ఇటీవల దివారియర్ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించిన ఈయన కొద్ది రోజుల క్రితం నిక్కీ గల్రాణి అనే సినీ హీరోయిన్ ను ఆయన ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరి వివాహానికి తెలుగు , తమిళ్ సెలబ్రిటీలు కూడా హాజరవడం జరిగింది.
ఇదిలా ఉండగా.. ది వారియర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆది పినిశెట్టి .. నిక్కీ గల్రాణి తో తన ప్రేమ, పెళ్లి ప్రయాణం గురించి వెల్లడించారు.. ఇక ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. నేను, నిక్కీ ఇద్దరం కూడా మలుపు సినిమా ద్వారా మంచి స్నేహితులమయ్యాము. ఇక ఈ సినిమా ప్రయాణంలో మా ఇద్దరి మధ్య ఒకటి రెండు సార్లు గొడవలు జరగడం తో మాట్లాడుకోవడం కూడా మానేశాము. కానీ ఆ సినిమా చివర్లో మళ్లీ దగ్గరయ్యే అవకాశం వచ్చింది. తర్వాత కూడా పలు సినిమాలలో కలిసి నటించాము. ఇక మొదట నిక్కి నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పింది. ఇక నేను కూడా ఒకే చెప్పాను. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కుదిరింది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పి.. ఆ తర్వాత వివాహం చేసుకున్నాము. ప్రస్తుతం మా ఇద్దరి ప్రయాణం చాలా సంతోషంగా సాగుతోంది అని ఆది పినిశెట్టి తెలిపాడు. ఇకపోతే వీరిద్దరూ కలిసి నటించిన శివుడు సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది అని వెల్లడించారు ఆది పినిశెట్టి.