ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరు నియమిస్తారు ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొంతమంది పేర్లు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జమ్మలమడుగు నియోజకవర్గం లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన గట్టిగా ప్రభావం చూపించారు.
అధికార వైసీపీ కి ఆయన చుక్కలు చూపించారు. ఆయన సొంత మండలంలో ఎనిమిది పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దీనిపై బీజేపీ అధిష్టానం చాలా సంతోషంగా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సొంత జిల్లాలో బీజేపీ ఒక పంచాయతీ లో కూడా గెలవలేక పోయింది. దీనిపై బీజేపీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉంది. అలాగే కొంతమంది కీలక నేతలు నియోజకవర్గాల్లో కూడా పార్టీ ప్రభావం చూపించలేదు.
కైకలూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సొంత మండలం లో కూడా ఎక్కువ స్థానాలను బిజెపి గెలవలేకపోయింది. దీంతో కొంత మంది నేతలను పక్కనపెట్టే ఆలోచనలో పార్టీ ఉందని సమాచారం. అందుకే జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రభావం చూపిస్తున మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ని పైకి తీసుకు వస్తే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.