నేను పోటీ చేసేది అక్కడి నుండే.. షర్మిల ప్రకటన !

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన షర్మిల కీలక ప్రకటన చేశారు. లోటస్ పాండ్ లో షర్మిలను ఖమ్మం జిల్లా నేతలు కలిశారు. ఈ సందర్భంగా వారితో చర్చలు జరిపిన షర్మిల తాను పాలేరు నుంచి బరిలోకి దిగుతానని పేర్కొన్నారు. వైఎస్సార్ కి పులివెందుల ఎలాగో.. నాకు పాలేరు అలాగేనని చెప్పుకొచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మన ప్రభంజనాన్ని ఆపలేరని ఆమె పేర్కొన్నారు.

మొన్న శుక్రవారం నాడు కూడా  ఖమ్మం జిల్లా నేతలతో  షర్మిల సమావేశం అయ్యారు. ఈ క్రమంలో ఇంతవరకు చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ జరగాలని, పార్టీ విధి విధానాలపై ఖమ్మం సభలోనే ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కి రెండు ప్రాంతాలు రెండు కళ్ళలా ఉండేవని, తెలుగు ప్రజల అభివృద్ధిని వైఎస్సార్ కోరుకున్నారని ఆమె పేర్కొన్నారు. రాజన్న సంక్షేమ పాలన కోసమే నేను ముందుకు వచ్చా, షర్మిలమ్మ రాజ్యం కోసం నేను రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పుకొచ్చారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...