Adipurush : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ” ఆదిపురుష్” రిలీజ్ డేట్ ఫిక్స్…

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే…ప్రస్తుతం ప్రభాస్… వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ లో ప్రభాస్ రావణుడిగా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. లంకేష్ పాత్రలో కనిపించనున్నారు సైఫ్ ఆలీ ఖాన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలోనే ఉంది.

అయితే.. తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించేసింది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news