Bigg Boss Telugu 5: తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. కంటెంస్టెంట్లు విమర్శలు, అరుపులు, గొడవలు. ఏడుపులు, అల్లర్లు, చిలిపి చేష్టాలు, ట్రైయాంగిల్ లవ్ సోర్టీలు, రొమాన్స్ చేస్తూ.. ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ను అందిస్తుంది. ఇలా బిగ్ బాస్ ఐదో సీజన్ ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.
విజయవంతంగా మూడు వారాల్లో మూడు ఎలిమినేషన్లను పూర్తి చేసుకుంది. మూడో వారం హై ఓల్టేజ్ గొడవల క్రియేట్ చేసిన బిగ్ బాస్.. నామినేషన్స్‌లో లహరి షారి, ప్రియ, ప్రియాంక సింగ్, మానస్, శ్రీరామ చంద్రలు నిలిపారు. మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ఈ సీజన్ నుంచి తాజాగా హాట్ బ్యూటీ లహరి షారి ఎలిమినేట్ అయింది. ఈ నేపథ్యంలోనే చూట్టూ కెమెరాలున్నాయి జాగ్రత్త.. ఆ పనులు చేయొద్దంటూ ఇద్దరు కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చింది లహరి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
శనివారం ఫుల్ సీరియస్‌గా ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చిన కింగ్ నాగ్.. ఇక సండే ఫన్ డే అంటూ సందడి చేశారు. లెహరాయి పాటకు స్టెప్పులు వేస్తు స్టేజీ మీదికి ఎంటరయ్యాడు. రావడం.. రావడంతోనే దేవతలా హాట్‌గా ఉన్నావ్ అంటూ హమీదను పొగిడేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ అమ్మడు.. కొత్తగా ఏదైనా చెప్పండి బాస్ అంటూ నాగార్జునకే కౌంటర్ వేసింది.
ఆ తర్వాత.. ఇంటి సభ్యులను రెండు టీంలుగా విడగొట్టి.. ఓ ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఫ్లే చేసిన పాటను మధ్యలో ఆపి.. బజర్ కొట్టి.. ఆ పాటను పూర్తిగా పాడాలి. ఆ తరువాత తమకు నచ్చిన ఓ కంటెస్టెంట్‌తో డ్యాన్స్ చేయించడమే ఈ టాస్క్.
ఈ టాస్క్‌లో సిరి, లహరి ముందుగా రాగా.. ఆ తర్వాత జెస్సీ- హమీద.. విశ్వ- శ్వేత.. సన్ని- ప్రియాంక.. మానస్- కాజల్… షన్ను- రవి.. నటరాజ్ మాస్టర్- యానీ మాస్టర్.. ప్రియ- లోబో కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం.. మరో ఫన్నీ ట్కాస్ ఇచ్చి నవ్వుల పువ్వులు పూయించాడు కింగ్ నాగ్.
ఆ తర్వాత కాసేపు ఉత్కంఠ రేపి.. అర్జున్ రెడ్డి బ్యూటీ లహరి ఎలిమినేట్ అంటూ ప్రకటించాడు. దీంతో కన్నీటీ పర్యంతమైంది. తనని తాను సర్దిచెప్పుకుంటూ జీవితంలో ఇదో పార్ట్ అంటూ.. బిగ్ బాస్ హౌస్
నుంచి వెళ్లిపోయింది. ఇక ఆ తర్వాత స్టేజ్ మీదకు వచ్చిన లహరిని.. ఫెయిల్యూర్ కంటెస్టెంట్స్ ఎవరనేది చెప్పాలని నాగార్జున అడగ్గా.. తాను అందరి గురించి చెబుతానని చెప్పింది.
ఆ సమయంలో ప్రతి కంటెస్టెంట్ పై తన మనసులో ఉన్న ఫీలింగ్ ను వెల్లగక్కింది.
ఇక ఆతర్వాత తను లేకపోయినా శ్వేతను స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించండి అంటూ ప్రియకు వార్నింగ్ ఇచ్చింది. మిగతా వారికే కాకుండా.. నీ గురించి కూడా నువ్వు టైం ఉంచుకో అంటూ శ్రీరామ్‌కు సలహా ఇచ్చింది.
నటరాజ్‌ను భోళా శంకరుడు అని, ఆయనకు అన్ని తెలుసని ఫీల్ అవుతాడు.. కానీ తనకు ఏం తెలియదని కుండబద్దలు కొట్టింది. తరువాత.. విశ్వతో మాట్లాడింది.. నువ్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి అని సలహా ఇచ్చింది. హమీదాను ఆడవాళ్లలో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని కితాబు ఇచ్చింది.
ఆ తరువాత.. యాంకర్ రవి, కాజల్ లకు కెమెరాలు ఉన్నాయ్ జాగ్రత్త అంటూ హెచ్చరించింది. వాళ్లు వ్యవహరిస్తున్న తీరుపై చురకలు అంటించింది అర్జున్ రెడ్డి బ్యూటీ. ‘వేరే వాళ్లు నామినేట్ చేశారని మీరు చేయకండి. దాని వల్ల ఈక్వేషన్స్ మారిపోతాయి అని మొదట కాజల్‌ను టార్గెట్ చేసింది. రవిని కూడా గట్టిగానే అరుసుకుంది. నేను ఏం చెప్పుతానో రవికి అల్రెడీ తెలుసు.. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ఏం చేసినా జాగ్రత్తగా చేయండి. ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడండి’ అంటూ రవిని కడిగేసింది లహరి.
ఆ తరువాత.. షణ్ముఖ్ జస్వంత్, సిరిలను కలిపి వార్నింగ్ ఇచ్చింది. వారిద్దరూ కలిసి ఆడుతున్నారని ఆరోపించింది. చిన్న నిర్ణయాలే పెద్ద పెద్ద పరిణామాలకు దారి తీస్తాయని అన్నది. ఇది ఏంట్రా షన్ను.. సిరి నామినేట్ చేసిందని.. నువ్ నన్ను నామినేట్ చేయడమేంట్రా అని ప్రశ్నించింది. సిరి చెప్పిందల్లా చేయకు.. ఎవరిని ఫాలోకాకు .. నీ గేమ్ నువ్వు ఆడుకో అని సలహా ఇచ్చింది.
తాను అలా చేయలేదని షణ్ముఖ్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సిరి కూడా చెప్పింది. కానీ లహరి మాత్రం వినలేదు. దీంతో షన్ను రియాక్ట్ అయ్యాడు.. మీరు అలా ఆలోచించడం రాంగ్ అని.. పదే పదే ఆ మాట అనకండి అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆ తరువాత సన్నీకి కూడా కౌంటర్ వేసింది. సన్నీ సెన్సిటివ్.. షార్ప్ అని అందరూ అనుకుంటారు. కానీ అంత కాదు అని అనేసింది. మానస్ ను చూసి ఎమోషనల్ అయ్యింది. ఆయన గురించి ఇంకా ఏం తెలుసుకోలేదనీ, తెలుసు కుందామని అనుకునేలోపు ఇలా బయటకు వచ్చానని బాధపడింది.