”ఆదిపురుష్” కొత్త రిలీజ్ డేట్ తో ఇబ్బందులే.!

-

ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా ”ఆదిపురుష్” ను తాజాగా వచ్చే ఏడాది వేసవిలో జూన్ 16న ‘ఆదిపురుష్’ను విడుదల చేయనున్నట్టు ఓం రౌత్  ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశగా ఎదురు చూశారు. కాని గ్రాఫిక్స్ నాసిరకం గా వున్నాయని, క్వాలిటీ కోసం సినిమాను వాయిదా వేశారు. కాని ఇప్పుడు  ఈ రిలీజ్ డేట్ ని ప్రకటించడం పై గందరగోళం నెలకొంది.

వాస్తవానికి జూన్ 2న షారుఖ్ ఖాన్ నటిస్తున్న `జావాన్` రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు హాలీవుడ్ మూవీస్ ` స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్రపైడర్ వర్స్ ` పార్ట్ 1 జూన్ 2న ట్రాన్స్ ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్స్` జూన్ 9 తేదీన  రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ కూడా పెద్ద సినిమాలే.ఇన్ని సినిమాల మధ్య `ఆది పురుష్`ని రిలీజ్ చేయడం పెద్ద మిస్టేక్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇప్పటికే బడ్జెట్ చేయి దాటి పొయింది. అంత బడ్జెట్ రికవరీ కావాలంటే మాత్రం సేఫ్ డేట్ వుండాలని అందరూ అభిప్రాయ పడుతున్నారు. ఖచ్చితంగా రిలీజ్ డేట్ మార్చాలని చాలా మంది కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news