పట్టాభి మీద దాడి ఆయన పనే.. !

Join Our Community
follow manalokam on social media

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ గురునానక్ కాలనీ లో నివాసం ఉండే పట్టాభి మీద కొద్ది రోజుల క్రితం ఒక గుంపు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి కేసుకు సంబంధించి కొంత మందిని విజయవాడ పోలీసులు నిన్న అరెస్టు చేశారు..అయితే ప్రధాన నిందితుడు అయిన ఆదిత్య అనే ఆయన సూచనల మేరకే తాము పట్టాభి మీద దాడి చేశామని పట్టుబడిన నిందితులు చెబుతున్నారు. అయితే అసలు ఈ ఆదిత్య ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆదిత్యతో తమకున్న పరిచయం కారణంగా అసలు ఎందుకు దాడి చేయాలి అని కూడా అడగకుండానే పట్టాభి మీద దాడి చేశామని నిందితులు పోలీసుల విచారణలో పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన ఆనంద్, వెంకటేష్, భాగ్యరాజు, భాస్కర్ రావు, సత్యనారాయణ, తులసిరామ్ అనే వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా వీరికి 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. మొత్తం మీద ఇప్పుడు ఆదిత్య ఎవరు అనేది మాత్రం మిస్టరీగా మారింది.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...