జగన్‌కు వైసీపీ నేత సెల్ఫీ వీడియో.. ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ !

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సొంత పార్టీకి చెందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ సెల్ఫీ వీడియో పంపడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా రొంపిచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ అంజయ్య జగన్ కి సెల్ఫీ వీడియో పంపారు. నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి టిడిపి కోసం గతంలో పనిచేసిన వారిని ఇప్పుడు గోగులపాడు సర్పంచ్ గా నిలబెట్టారని అయితే ముందు నుంచి వైసీపీలో ఉన్న తాము కూడా ఇది జీర్ణించుకోలేక పోటీకి దిగామని ఆయన పేర్కొన్నారు.

అయితే పోటీ నుంచి తప్పుకోవాలని సీఐ కృష్ణయ్య చేత ఎమ్మెల్యే గోపి రెడ్డి తనను వేధించాడని ఆయన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.. ఎమ్మెల్యే గోపి రెడ్డి సిఐ కృష్ణయ్య నుంచి తమ కుటుంబాన్ని కాపాడాలని అంజయ్య వీడియో లో జగన్ ను కోరారు. గోగులపాడు  గ్రామం నుంచి వైసీపీ సర్పంచ్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఏకగ్రీవాలు టార్గెట్ గా ముందుకు వెళుతున్న వైసిపి ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలు కోసం సొంత పార్టీ రెబల్ అభ్యర్థులు బరిలో ఉన్నా సరే వారి మీద బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో వినిపిస్తున్నాయి. ఇదే కోవలో గోపిరెడ్డి కూడా అంజయ్యను పోలీసుల చేత నిర్బంధించారని చెబుతున్నారు.  

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...