భర్తను వదిలి ప్రియుడు ఇంటికి, ఆదివాసి మహిళ బట్టలు విప్పి మరీ !

-

దేవాస్ జిల్లాలోని బోర్పాడవ్ గ్రామానికి చెందిన బాధితురాలు, అదే గ్రామానికి చెందిన హరిసింగ్ అనే వ్యక్తితో కొన్నాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అయితే గత నెల 24న ఆమె ఇంటి నుంచి పరారై గుట్టుగా ప్రియుడి ఇంట్లో నివసిస్తోంది. అయితే భార్య కనిపించకపోవడం పై ఆందోళన చెందిన భర్త మంగీలాల్ ఆమె కోసం వెతికాడు.

అయినా భార్య ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే ఆదివారం రోజున ఎందుకో అనుమానం వచ్చి హరిసింగ్ ఇంటికి వచ్చిన మంగీలాల్, ఓ గదిలో తలదాచుకుంటున్న భార్యను చూశాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది.

ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు నడివీధిలో బహిరంగంగా వారిని చితకబాదారు. బాధితురాలిని వివస్త్రను చేసి దాడి చేశారు. అంతేగాక తన భర్తను భుజాలపై మోస్తూ గ్రామం అంతా తిరిగే విధంగా ఆమెకు గ్రామస్తులు శిక్ష విధించారు. అనంతరం ఆమెకు, ప్రియుడికి చెప్పుల దండ వేసి చితకబాదారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news