ఆయన ఓ క్లీన్ ప్రొడ్యూసర్ .ఇప్పటివరకు కళలను గౌరవిస్తూనే సినిమాలు తీసాడు.ఎక్కడా తనకున్న ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని సినిమా చేసింది లేదు.అలాంటి ఆ నిర్మాత ఏరోటిక్ సీన్లతో తన ఇమేజ్ బ్రేక్ చేస్తూ ఓ అడల్ట్ సినిమా తీసాడని టాక్ నడుస్తుంది.ఇదే విషయాన్ని అడిగితే మాత్రం ఓపెన్ ఛాలెంజ్ చేసి మరీ నేను తీయలేదంటున్నాడు.
డర్టీ హరి.గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో నోటెడ్ అవుతోన్న పిక్చర్ .ఎమ్ ఎస్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా కాకుండా డైరెక్టర్ గా తన లక్ టెస్ట్ చేసుకుందామని ట్రై చేస్తున్నాడు. బిటౌన్ లస్ట్ స్టోరీస్ కు ఏమాత్రం తీసిపోని విధంగా తయారుచేసిన డర్టీ హరితో ఎమ్ ఎస్ రాజు తన క్లీన్ ఇమేజ్ పాడుచేసుకుంటున్నాడనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తుంది,
ఈనెల 18న ఫ్రైడే మూవీస్‌లో పే పర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అవుతోన్న ఈ పిక్చర్ ఇప్పటికే ఏరోటిక్ సీన్లతో నెట్టింట్లో సందడి చేస్తుంది.ఇదే విషయంపై వివరణ కోరగా.. బూతు వేరు, శృంగారం వేరు అంటున్నారు.ఓ అమ్మాయితో అబ్బాయి ఇన్వాల్వ్ అయినప్పుడు ఎంత దిగజారతాడనేది చెప్పడానికి ‘డర్టీ హరి’ టైటిల్ పెట్టామని.. అతను డర్టీ అనేది చెప్పకపోతే డ్రామా పండదని.. సినిమాలో మంచి హ్యూమన్ డ్రామా ఉందని.. ఈ సినిమా చూసేలా ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి తాను ఓ టెక్నిక్ వాడాను తప్ప ప్రేక్షకులు అనుకుంటున్నట్లుగా సినిమా ఉండదని డైరెక్టర్ చెబుతున్నారు.
ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసిన బన్నీ వాసుకు… స్టోరీ నచ్చడంతో వెంటనే చెక్ రాసివ్వడం జరిగిపోయింది.ఇప్పుడు ఏటీటీలో రిలీజ్ అవుతోన్న ఈ ఫిలిం జనవరిలో ఓటీటీలో రిలీజ్ కానుంది.సినిమా నిర్మాణానికి 3.5కోట్లు కాగా..5కోట్ల బిజినెస్ జరిగింది.అంటే ఒకటిన్నర కోటి టేబుల్ ప్రాఫిట్ వచ్చేసింది.ఇప్పటివరకు తమని కొశ్చన్ చేసినవారు సినిమా రిలీజ్ అయ్యాక తనను ప్రశ్నలు వేయొచ్చని రాజు సవాల్ విసిరాడు. ఐతే ఈలోపు తన ఇమేజ్ కు డ్యామేజ్ కలగకుండా చూసుకుంటున్నాడు.