ఐపీఎల్‌కు త‌ప్ప‌ని తిప్ప‌లు.. స్టార్ నెట్‌వ‌ర్క్ త‌లుపు త‌డుతున్న అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు..

-

గ‌త సీజ‌న్‌లో ఐపీఎల్‌ను చాలా ఆల‌స్యంగా నిర్వ‌హించిన‌ప్ప‌టికీ చ‌క్క‌ని రేటింగ్స్ వ‌చ్చాయి. కానీ ఈ సీజ‌న్‌కు ప‌రిస్థితి మారింది. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువ‌గా ఉండ‌డం, అనేక చోట్ల లాక్‌డౌన్‌ల‌ను విధిస్తుండ‌డం, కోవిడ్ బారిన ప‌డిన ప్లేయ‌ర్లు, సిబ్బంది.. వెరసి ఈ సారి ఐపీఎల్ యాజ‌మాన్యానికి పుట్టెడు క‌ష్టాలు వ‌చ్చాయి. అయితే ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేస్తున్న స్టార్ నెట్‌వ‌ర్క్ కు కూడా ప్ర‌స్తుతం క‌ష్టాలు మొద‌ల‌య్యాయి.

advertisers are knocking doors of star network over dropped ipl viewership

ఈ సీజ‌న్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు వ్యూయ‌ర్‌షిప్ బాగా త‌గ్గింది. ఇటీవ‌ల ప్ర‌క‌టించిన బార్క్ రేటింగ్స్ ఆ విష‌యాన్ని చెబుతున్నాయి. ఐపీఎల్ 2019 సీజ‌న్‌లో మొద‌టి 17 మ్యాచ్‌ల‌కు 6.07 బిలియ‌న్ల వ్యూయింగ్ మిన‌ట్స్ రాగా, 2020 సీజ‌న్‌కు మొద‌టి 14 మ్యాచ్‌ల‌కు 8.34 బిలియ‌న్ల వ్యూయింగ్ మిన‌ట్స్ వ‌చ్చాయి. అయితే ఈ సీజ‌న్‌కు మొద‌టి 17 మ్యాచ్‌లకు 6.62 బిలియ‌న్ల వ్యూయింగ్ మిన‌ట్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. 2019తో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే అయిన‌ప్ప‌టికీ గ‌త సీజ‌న్‌తో పోలిస్తే మాత్రం ఈ సంఖ్య చాలా త‌క్కువ‌నే చెప్ప‌వ‌చ్చు.

ఇక 2019 సీజ‌న్‌లో మొద‌టి 17 మ్యాచ్‌ల‌కు 101 మిలియ‌న్ల వ్యూయ‌ర్లు న‌మోదు కాగా, 2020 సీజ‌న్‌లో మొద‌టి 14 మ్యాచ్‌ల‌కు 116 మిలియ‌న్ల వ్యూయ‌ర్లు న‌మోదు అయ్యారు. ఈ సీజ‌న్‌లో మొద‌టి 17 మ్యాచ్‌ల‌కు 105 మిలియ‌న్ల వ్యూయ‌ర్లు న‌మోదు అయ్యారు. ఈ క్ర‌మంలోనే గ‌త సీజ‌న్‌తో పోలిస్తే ఈసారి ఐపీఎల్‌ను చూసే వారి సంఖ్య కూడా బాగా త‌గ్గింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ క్ర‌మంలోనే ఐపీఎల్ మ్యాచ్ ల‌లో యాడ్స్‌ను ఇస్తున్న అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు స్టార్ నెట్‌వ‌ర్క్ త‌లుపు త‌డుతున్నారు. త‌మ‌కు యాడ్‌ల‌లో డిస్కౌంట్లు అయినా ఇవ్వాల‌ని లేదా కొన్ని నిమిషాలను అద‌నంగా అయినా పెంచాలని వారు కోరుతున్నారు. అయితే దీనిపై స్టార్ నెట్‌వ‌ర్క్ స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news