సిఎం సంచలన నిర్ణయం, రిక్షా వాళ్లకు నెలకు 5 వేలు సాయం…!

కరోనా విషయంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రోజు వారి కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలకనిర్ణయం ప్రకటించింది. ఢిల్లీలోని ఆటో, రిక్షా డ్రైవర్లకు 5వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. సంక్షోభం సమయంలో ఆటో,రిక్షా డ్రైవర్లకు చేయూత ప్రభుత్వం సహాయం చేయనుంది.

ఢిల్లీలోని 72 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులకు 2 నెలల పాటు ఉచిత రేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరో రెండు నెలల పాటు ఢిల్లీలో స్వల్ప లాక్ డౌన్ కొనసాగుతుందని స్పష్టం ప్రభుత్వం స్పష్టం చేసింది. పేద ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుంది అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివరించారు. ఢిల్లీలో ఇటీవల లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.