మరోసారి భూప్రకంపనలు.. టర్కీ, సిరియాల్లో 34వేలు దాటిన మృతులు

-

టర్కీ, సిరియా వాసులను భూకంపం క్షణక్షణం భయానికి గురిచేస్తోంది. ఇప్పటికే వేలమంది ప్రాణాలు బలితీసుకున్న భూకంపం.. మళ్లీ మళ్లీ కంపిస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రోజున టర్కీ దక్షిణ నగరమైన కహ్రమన్మరాస్‌లో 4.7 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.

మరోవైపు టర్కీలోని హతాయ్ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి. భూకంపం ధాటికి ధ్వంసమైన విమానాశ్రయాన్ని వేగంగా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. గతవారం తుర్కియే, సిరియాలో సంభవించిన భూ ప్రళయంలో మృతుల సంఖ్య 34 వేలు దాటింది.

టర్కీలోని హతే ప్రాంతంలో 128 గంటల తర్వాత.. రెండు నెలల పాపని సహాయక బృందాలు ప్రాణాలతో రక్షించాయి. 70 ఏళ్ల వృద్ధురాలు, ఆరు నెలల గర్భిణిని సైతం సహాయక బృందాలు కాపాడాయి. మరోవైపు గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా సహాయక సిబ్బంది అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.

భూకంపం ధాటికి మరణించిన….వేలాదిమందిని ఖననం చేయడానికి తుర్కియేలోని అంతక్య ప్రాంతంలో తాత్కాలిక శ్మశానవాటిక నిర్మించారు. బుల్డోజర్లతో గుంతలను తవ్వి ఖననం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మృతదేహాలతో అంబులెన్సులు, ట్రక్కులు.. శ్మశానవాటికకు నిరంతరాయంగా వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news