ప్రపంచ దేశాలు ఆప్గన్ లోని తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకుంటే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని తమ ప్రభుత్వాన్ని గుర్తించడంలో సమయాన్ని వృథా చేయవద్దని అమెరికా మరియు ఇతర ప్రపంచ దేశాలను ఆదేశ సమాచార మరియు సాంస్కృతిక శాఖ డిప్యూటీ మంత్రి జబీహుల్లా ముజాహిద్ కోరారు. ఆప్గన్ లో సమస్యలు ఇలాగే కొనసాగితే ఈ సమస్య ఆప్రాంతంతో పాటు ప్రపంచానికి సమస్యగా మారుతుందని తాలిబన్ మంత్రి అన్నారు. గుర్తింపు తాలిబన్ హక్కు అని ఇది లేకపోతే దేశం అతిపెద్ద ఆర్థిక, మానవత సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.
గత ఆగస్టులో ప్రజాప్రభుత్వం నుంచి అధికారం స్వాధీనం చేసుకున్న తర్వాత నుంచి ప్రపంచ దేశాలు తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించేదుకు నిరాకరిస్తున్నాయి. దీంతో ఆదేశంలో ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. దీంతో పాటు రానున్న రోజుల్లో ప్రజలు మరింతగా పేదరికంలోకి కూరుకుపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆప్గన్ ప్రభుత్వం నడవాలంటే 80 శాతం నిధులు విదేశాల నుంచి అందాల్సిందే. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత అమెరికాతో చేసుకున్న ఒప్పందాల్లోని అంశాలను అమలు చేయడమం లేదు. ప్రభుత్వంలో వివిధ వర్గాలకు భాగస్వామ్యం కల్పించలేదు. స్త్రీ విద్యను తాలిబన్లు వ్యతిరేఖిస్తున్నారు. అమెరికా ఆప్గన్ లోని 10 బిలియన్ డాలర్ల విదేశీ ఆస్తులపై ఫ్రీజింగ్ పెట్టింది.