విశాఖ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి నిజాయితీ గా విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పాటు పడాలని జన సేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ గారు.. మీరు గతంలో గంగవరం పోర్టు అమ్మినట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని ఫైర్ ఆయారు నాదెండ్ల మనోహర్. ఇవాళ జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖ లో పర్యటించారు.
ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు అంతా నడుం బిగించాలన్నారు. సీఎం జగన్ ఉత్తరాలు రాశారు.. ఉత్తరాల వల్ల ప్రైవేటీకరణ ఆగలేదని గుర్తు చేశారు.
జనసేన మొదటి రోజు నుంచి అండగా నిలబడ్డామని.. ఉక్కు పరిరక్షణ సమితికి మద్దతిచ్చామని పేర్కొన్నారు నాదెండ్ల మనోహర్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం జగన్ నిజాయితీగా పోరాడాలని.. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు వున్నారని చురకలు అంటించారు. మీరెందుకు పోరాడడం లేదని వైసీపీ ని ప్రశ్నించారు. అన్ని పార్టీలను కలుపుకుని ఢిల్లీ వెళదాం అని పవన్ కళ్యాణ్ కోరారని.. . అఖిలపక్షాన్ని ఎందుకు తీసికెళ్ళడం లేదని నిలదీశారు నాదెండ్ల మనోహర్.