పిల్ల టీం గా వరల్డ్ కప్ లోకి అడుగుపెట్టిన ఆఫ్గనిస్తాన్ సంచలన విజయాలను సాధిస్తూ పెద్ద టీం లకు సైతం షాకులు ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ పాకిస్తాన్ మరియు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్లను ఒంటి చేత్తో మట్టికరిపించి భళా అనిపించుకుంది. ఇక మ్యాచ్ మ్యాచ్ కు వీరి ప్రదర్శనలో మెరుగవుతోంది. ఈ రోజు జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ నెదర్లాండ్ ను చిత్తు చిత్తుగా ఓడించి వరుసగా మూడవ విజయాన్ని అందుకుని సెమీస్ కు మరొక అడుగు ముందుకు వేసింది. ఇక ఈ విజయంతో ఆఫ్గనిస్తాన్ ఆడిన 7 మ్యాచ్ లలో నాలుగు గెలిచి మొత్తం ఎనిమిది పాయింట్లు సాధించి 6 పాయింట్లు సాధించిన పాకిస్తాన్ ను వెనక్కు నెట్టి అయిదవ స్థానంలో నిలిచింది. ఇక పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మరియు ఆఫ్గనిస్తాన్ లు మ్యాచ్ లు పూర్తయ్యే సరికి ఎనిమిది పాయింట్లు సాధించి ఈక్వల్ గా ఉన్నాయి..
కానీ కివీస్ ఆఫ్ఘన్ కన్నా మెరుగైన రన్ రేట్ ను కలిగి ఉండడం కారణంగా ముందు స్థానంలో ఉంది. ఇక ఇండియా, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా లు వరుసగా మూడు స్థానాలలో ఉన్నారు.