బాంబు పేలుడుతో దద్దరిల్లిన ఆప్ఘన్…. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో దాడి

-

ఆఫ్ఘనిస్తాన్ మరోసారి రక్తమోడింది. ఉత్తర మజార్-ఎ-షరీఫ్ శక్తివంతమైన పేలుడు సంభవించింది. షియా ముస్లింలు లక్ష్యంగా ఈ పేలుళ్లు సంభవించాయి. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సయమంలో ఉగ్రవాదులు బాంబు దాడులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది మరణించగా… 40 మంది వరకు గాయపడ్డారు. ఉత్తర మజార్-ఎ-షరీఫ్ సాయిడోకెన్ మసీదులో ఈ దాడి జరిగింది. ఈ దాడికి ముందు కాబూల్ లో ల్యాండ్ మైన్ పేరి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో షియా ముస్లింలను, మైనారిటీ వర్గాలను టార్గెట్ చేస్తూ బాంబు దాడులకు తెగబడుతున్నారు. 

కాగా.. ఈ బాంబు దాడులకు బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. కానీ ఆప్ఘన్ లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్న తరువాత నుంచి వరసగా ఐఎస్-కే ఉగ్రవాద సంస్థ దాడులకు తెగబడుతోంది. ఈ దాడికి ఒక రోజు ముందు కాబూల్ లోని ఓ పాఠశాలపై బాంబు దాడులు చేశారు ఉగ్రవాదులు. ఈ ఘటనలో 6 గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Read more RELATED
Recommended to you

Latest news