ఏపీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రారంభం..75 శాతం స్థానికులకే ఉద్యోగాలు

-

తూర్పుగోదావరి జిల్లాలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కాస్టిక్ సోడా పరిశ్రమను ప్రారంభించారు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… మాట్లాడుతూ…బలభద్రపురం ప్లాంట్ మూడు దశల్లో 2,473 కోట్ల పెట్టుబడి రానుందన్నారు. 2,450 మందికి ఉద్యోగాలు వస్తాయి…ఆదిత్య బిర్లా లాంటి వారు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం శుభపరిణామం అని పేర్కొన్నారు. 2010 నుంచి ఈ ప్రాజెక్టు అనేక ఇబ్బందులు పడుతూ వచ్చిందన్నారు.

గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు సంతకాలు చేసేసిందని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.క్యాపిటీవ్ థర్మల్ ప్లాంట్ లేకుండా యాజమాన్యాన్ని ఒప్పించాము..ఈ ప్రాజెక్టు కాలుష్యం గురించి భయాలు అన్నీ తొలగించామన్నారు. 75శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా ఒప్పించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రామల అభివృద్ధిలో ఆదిత్య బిర్లా భాగస్వామం కావాలి…ఎలాంటి సహకారం కావాలన్నా ఎ.పి ప్రభుత్వం అందిస్తుందన్నారు సి.ఎం జగన్ మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news