20 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చిన లెదర్‌బ్యాక్ తాబేలు…!

-

కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు ఒక్కొక్క వింత బయటపడుతుంది. జనాలు బయటకు వెళ్లకపోవడంతో ఒక్కొక్క జంతువు బయటకు వస్తుంది. తాజాగా తీర ప్రాంతం ఎక్కువగా ఉండే థాయ్‌లాండ్‌లోని లెదర్ బ్యాక్ సముద్ర తాబేళ్ల గూళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్న బీచ్‌లలో కనిపించాయి. కరోనా దెబ్బకు పర్యాటకులు ఎవరూ కూడా తీర ప్రాంతాలకు వెళ్ళడం లేదు. దీనితో బీచ్ లు పూర్తి ఖాళీగా ఉన్నాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు చెందిన సుశాంత నంద దీనికి సంబంధించిన పోస్ట్ ని ట్విట్టర్ లో చేసారు. “రెండు దశాబ్దాల తరువాత మొదటిసారిగా 11 లెదర్‌బ్యాక్ తాబేలు గూళ్ళు ఎడారిగా ఉన్న థాయ్ బీచ్‌లలో ఉన్నాయి. పర్యాటకం కూలిపోయింది. లెదర్‌బ్యాక్ అతిపెద్దది సముద్ర తాబేళ్లు, థాయిలాండ్‌లో అంతరించిపోతున్నాయి. ఇవి ప్రజల నుంచి హాని ప్రమాదం ఉన్న జాబితాలో చేర్చారు.

ఫుకెట్ మెరైన్ బయోలాజికల్ సెంటర్ డైరెక్టర్ కొంగ్కియాట్ కిట్టివాటనావాంగ్ మాట్లాడుతూ… గత నవంబర్ నుండి కనుగొన్న పదకొండు తాబేలు గూళ్ళు ఇరవై ఏళ్ళలో అత్యధికమని చెప్పారు. “ఇది మాకు చాలా మంచి సంకేతం, ఎందుకంటే అనేక ప్రాంతాలు మనుషులు నాశనం చేసారు. మత్స్యకారులతో వాటికి హాని ఏర్పడింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news