70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండు : సీఎం రేవంత్ రెడ్డి

-

డీకే అరుణతో తనకు వ్యక్తిగత కక్షలు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డీకే అరుణకు కాంగ్రెస్ ఏం అన్యాయం చేసింది. అరుణ ను మంత్రిని చేసింది కాంగ్రెస్సే కాదా?. అరుణకు గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అని మండిపడ్డారు.రేవంత్ రెడ్డి నాపై పగ పట్టారని అరుణమ్మ అంటుంది..అరుణమ్మ దగ్గర ఏముంది..గుంజుకోవడానికి. సీఎం పదవికన్నా పెద్ద పదవి అరుణ దగ్గర ఉందా? అని ప్రశ్నించారు. డీకే అరుణ ఏం చేసిందని..పాలమూరులో ఓటు అడుగుతుంది. గాడిద గుడ్డు ఇచ్చిన అరుణకు ఎందుకు ఓటెయ్యాలి అని మండిపడ్డారు.

మహబూబ్ నగర్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే అని , మహబూబ్ నగర్ , నాగర్ కర్నూలులో లక్ష మెజారిటీ ఖాయమన్నారు రేవంత్ రెడ్డి. వనపర్తిలో గెలుపు కోసం నేను గల్లీగల్లీ తిరిగా. పాలమూరు జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లిచ్చి ఆశీర్వదించారు అని అన్నారు.70 ఏండ్ల తర్వాత పాలమూరు బిడ్డ సీఎం అయ్యిండు. పాలమూరుకు సోనియాగాంధీ అత్యున్నత పదవిచ్చారు. ముఖ్యమంత్రి పదవి నుంచి నన్ను దించుతామని..ప్రభుత్వాన్ని కూలగొడుతాం అంటూ పిచ్చికూతలు కూస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి జిల్లా అభివృద్దికి కలిసి రావాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news