కాసేపట్లో నాంపల్లి కోర్టుకి రాజాసింగ్

-

గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తను కించపరిచే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాజాసింగ్ ఓ వివాదాస్పద వీడియోని శ్రీరామ్ ఛానల్ తెలంగాణ లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో ఓ 53 ఏళ్ల వ్యక్తి 6 ఏళ్ల బాలికను పెళ్ళాడాడని పరోక్షంగా హేళన చేసినట్లు తెలుస్తోంది. ఆ వీడియో సోమవారం వెలువడ్డాక బషీర్బాగులోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి.

ముస్లిం నేతలు తమ మత మనోభావాలను కించపరిచే విధంగా రాజా సింగ్ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రాజాసింగ్ ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ పరిణామాలతో రాజా సింగ్ పై కేంద్రం సీరియస్ అయింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది బిజెపి. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో పది రోజుల్లో సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి రాజా సింగ్ ని మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు రాజా సింగ్ మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతాయని తనకు ముందే తెలుసు అని.. కానీ ధర్మం కోసం తాను ఇలాగే మాట్లాడతానని చెప్పారు. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన తరువాత రెండో పార్ట్ వీడియోని విడుదల చేస్తారని చెప్పారు రాజా సింగ్. తన పై ఎలాంటి చర్యలు తీసుకున్న తాను ఎప్పుడూ మోడీ,అమిత్ షా ఫాలోవర్ గానే ఉంటానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news