తరచూ కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా.. ఉపశమనానికి ఈ చిట్కాలు ట్రై చేయండి

-

చాలా మందిలో కాసేపు కూర్చోగానే కాళ్లు తిమ్మిర్లు వస్తుంటాయి. ఇలా తరచూ జరిగితే కాస్త జాగ్రత్తపడాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. అయితే తరచూ తిమ్మిర్లు రాకుండా ఉపశమనం కోసం ఇంట్లోనే సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి.

బిజీబిజీ లైఫ్ లో తినడానికే చాలా మందికి టైం ఉండదు. ఇక వ్యాయామం సంగతి సరేసరి. అందుకే కొందరిలో నరాల గజిబిజి కదలిక వల్ల కాసేపు కూర్చోగానే కాళ్లు తిమ్మిర్లు పడుతుంటాయి. కొన్నిసార్లు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కాలు తిమ్మిర్లు వస్తాయి. ముఖ్యంగా కండరాల్లో దృఢత్వం సమస్య వలన తిమ్మిర్లు నొప్పి బాధాకరంగా మారుతుంది. కాలు తిమ్మిర్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక వ్యాయామం , బరువు పెరగడం లేదా శరీరంలో నీరు లేకపోవడం, రక్త ప్రసరణలో సమస్యల కారణంగా కాళ్ళ తిమ్మిరి ఏర్పడవచ్చు. మీరు తరచుగా కాలు తిమ్మిరిని ఎదుర్కొంటూ నొప్పి పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే.. ఉపశమనం కోసం ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. కొన్ని పరిస్థితిలో వైద్యుడిని చూడటం ఉత్తమం అయినా.. ఇంట్లోని వస్తువులతో సహజంగా కూడా కాళ్ల తిమ్మిరి నుంచి ఉపశమనం పొందవచ్చు.

కాళ్ల నొప్పులతో బాధపడేవారిలో ఎక్కువగా పోషకాలు లోపించి ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక మూలకాల లోపం మీ సమస్యను మరింత పెంచుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అటువంటి పోషకాలను అందించే ఆహారాన్ని తినండి.

విటమిన్ డి, క్యాల్షియం లోపం వల్ల కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు మొదలవుతాయి. మీరు ఉపశమనం కోసం ఇంటి నివారణలను అనుసరించాలనుకుంటే, మీరు ప్రతిరోజూ వేడి పాలు తాగడం అలవాటు చేసుకోవాలి. పాలు కాల్షియం ఉత్తమ ఆహారం. ఎముకలను, కండరాలను బలంగా చేస్తుంది. ప్రతి రాత్రి నిద్రపోయే ముందు పసుపు పాలు త్రాగండి, అయితే త్రాగేటప్పుడు పరిమితిగా తీసుకోండి.

వేడి నీటితో స్నానం చేసే అలవాటు మీకు అనేక ప్రయోజనాలను తెస్తుంది. వాటిలో ఒకటి కాళ్ళ తిమ్మిరి సమస్య నుండి ఉపశమనం. రోజూ పాదాలపై గోరువెచ్చని నీటిని పోసుకుని శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో రక్తప్రసరణను అడ్డుపడే సిరలు తెరుచుకోవడంతోపాటు కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఈ పద్ధతి శరీరాన్ని రిలాక్స్‌ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news