ఇదేం గోలరా బాబు, కరోనాతో చస్తుంటే మిడతల దండయాత్ర మొదలయ్యేలా ఉంది…!

-

ఒక పక్క దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు కూడా వందల్లో నమోదు అవుతున్నాయి. ప్రభుత్వ౦ దాన్ని ఏ విధంగా కట్టడి చెయ్యాలో అర్ధం కాక నానా అవస్థలు పడుతూ వస్తుంది. కేసుల సంఖ్య పెరగడమే గాని తగ్గే అవకాశం మాత్రం ఇప్పట్లో లేదని అంటున్నారు. మరణాలు కూడా పెరుగుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో కనీసం మూడు నుంచి 400 మంది కరోనా వైరస్ కారణంగా చనిపోయే అవకాశం ఉంది.

ఇన్ని ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన దేశానికి మరో ప్రమాదం పొంచి ఉంది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అది వైరస్ రూపంలో కాదు లే… మిడతల రూపంలో… ఇరాన్ ఎడారుల్లో ఉండే మిడతల దండు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. అక్కడి నుంచి మన రాజస్థాన్ ఎడారి ప్రాంతంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలోకి భారీగా మిడతల దండు వచ్చే అవకాశం ఉంది.

జొన్న సహా అనేక పంటలను ఇవి తినేస్తాయి. ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అక్కడి రైతులు భారీగా స్పీకర్ లు పెడుతున్నారు పంట పొలాల్లో. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో దాడి చేస్తే వాటిని తోలడం చాలా కష్టం. లక్షల హెక్టార్లలో ఉండే వాణిజ్య పంటలను నాశనం చేసే సూచనలు ఉన్నాయి. కరోనాతోనే ఒక పక్క జనం చస్తుంటే ఇప్పుడు ఈ గోల మొదలయింది.

గుజరాత్, రాజస్థాన్ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సూచనలు కూడా చేస్తున్నారు. స్ప్రేయ్ చేసే అవకాశం కూడా ఉండదు. ఒక్కసారి అవి దాడి చేసాయి అంటే చాలు వాటిని ఆపడం ఎవరి తరం కాదు. మహారాష్ట్ర నుంచి తోలితే అవి కర్ణాటక వెళ్తాయి, అక్కడ తోలితే ఆంధ్రప్రదేశ్ వస్తాయి. లేదా మహారాష్ట్ర నుంచి తెలంగాణా వచ్చే అవకాశాలే ఉంటాయి. దీని మీద కేంద్రం కూడా ఇప్పటికే అప్రమత్తం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news